“ఒక్కోక్కడి ఒళ్లు పగిలిపోద్ది?”.. స్టార్ హీరో మాస్ వార్నింగ్ పోలా అద్దిరిపోలా..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ రన్వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా పెళ్లయి చాలా కాలమే అవుతున్న ఈ జంట గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో రకరకాల వార్తలు వినిపించాయి. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే హీరోయిన్ దీపికా పదుకొనే తాను ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటించింది .

దీంతో రన్వీర్ దీపికా పదుకొనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు . సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంస్టాగ్రామ్ నుంచి రన్వీర్ సింగ్ తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. దీంతో మళ్ళీ యవ్వారం మొదటికి వచ్చింది. రన్వీర్ దీపికా విడిపోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటులు కావడంతో జెట్ స్పీడ్ లో ఈ వార్త ట్రెండ్ అయింది . దీనికి పరోక్షకంగా కౌంటర్ వేసేశాడు రన్వీర్ సింగ్.

ముంబైలోని జ్యూవెలరీ బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న రన్వీర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ” నాకు ఇష్టమైన రింగ్స్ రెండే రెండు ఉన్నాయి. అందులో ఒకటి మా పెళ్ళికి నా భార్య గిఫ్ట్ గా ది. ఇచ్చినఅలాగే రెండోది ప్లాటినం ..మా ఎంగేజ్మెంట్ కు దీపిక నా చేతికి పెట్టింది . ఈ రెండు నాకు చాలా చాలా ఇష్టం “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో రన్వీర్ సింగ్ దీపికా విడాకుల వార్తలు చెక్ పడింది. రన్వీర్ – దీపిక ఫ్యాన్స్ చాలా బోల్డ్ గా స్పందిస్తున్నారు. ఇక ఒక్కొక్కరికి ఒళ్ళు పగిలిపోద్ది ఎవరైనా రణవీర్ దీపిక విడాకులు తీసుకుంటారు విడాకులు తీసుకోబోతున్నారు అని ప్రచారం చేస్తే అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!