ఎన్టీఆర్‌ను ఎద‌గ‌నివ్వ‌ని చంద్ర‌బాబు భ‌ర‌త్‌ను ఎద‌గ‌నిస్తాడా.. మీ పిచ్చిగాని..!

ఎస్ ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో ఒక రోజు మాత్ర‌మే టైం ఉంది. స‌హ‌జంగానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఎవ‌రిని ఎలా బ‌లి చేస్తాడ‌న్న చ‌ర్చ‌లు బాగా న‌డుస్తున్నాయి. బీజేపీ, ప‌వ‌న్‌ను 2014లో ఎలా వాడుకుని.. త‌న అవ‌స‌రం తీరాక 2019 ఎన్నిక‌ల‌కు వ‌దిలించుకున్నాడో చూశాం. క‌ట్ చేస్తే ఇప్పుడు మ‌ళ్లీ త‌న అవ‌స‌రం కోస‌మే వారితో జ‌ట్టుక‌ట్టాడు. చంద్ర‌బాబుకు బ‌య‌ట వాళ్ల‌నే కాదు.. త‌న సొంత కుటుంబం వాళ్ల‌నే అవ‌స‌రాల కోసం వాడుకుని పూచిక పుల్ల‌లా తీసేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌.

ఎన్టీఆర్‌నే గ‌ద్దె దించిన చంద్ర‌బాబు అదే కుటుంబంలో హ‌రికృష్ణ‌ను మంత్రిని చేసి త‌ర్వాత సీటివ్వ‌లేదు. ఆ త‌ర్వాత అదే హ‌రికృష్ణ‌కు 2009 ఎన్నిక‌ల‌కు ముందు త‌న అవ‌స‌రాల కోసం రాజ్య‌స‌భ ఇచ్చి 2014 ఎన్నిక‌ల్లో పెన‌మలూరు లేది నూజివీడు సీటు ఇవ్వ‌మ‌ని బ‌తిమిలాడినా ఇవ్వ‌లేదు. ఇక 2009 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్‌ను ప్ర‌చారం కోసం తిప్పుకుని ఆయ‌న త‌ర్వాత వ‌దిలించుకున్నారు. 2014 ఎన్నిక‌ల‌కు ఎన్టీఆర్‌ను కాద‌ని ప‌వ‌న్ ఇంటికెళ్లి మ‌రి బ‌తిమిలాడి మ‌ద్ద‌తు తీసుకున్నారు. బాల‌య్య పిల్ల‌ను కోడ‌లిని చేసుకుని.. ఆయ‌న‌కు ఎమ్మెల్యే సీటు ఇచ్చి మ‌రీ త‌న దొడ్లో క‌ట్టేసుకున్నాడు.

హ‌రికృష్ణ మ‌ర‌ణాంత‌రం సానుభూతి కోసం ఆయ‌న కుమార్తె నంద‌మూరి సుహాసినికి తెలంగాణ‌లో ఓడిపోతామ‌ని తెలిసి కూక‌ట్‌ప‌ల్లి సీటు ఇచ్చి బ‌లి చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె ఘోరంగా ఓడిపోయింది. ఆ త‌ర్వాత ఆమెను ప‌ట్టించుకోలేదు. ఇక తార‌క‌ర‌త్న టీడీపీని అధికారంలోకి తీసుకు వ‌చ్చేందుకు లోకేష్ స్టార్ట్ చేసిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు తొలిరోజే వ‌చ్చి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత ఆ కుటుంబాన్ని బాబు సైడ్ చేసేశార‌న్న టాక్ ఉంది.

ఎన్టీఆర్‌ను గ‌ద్దె దించేందుకు తోడ‌ళ్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు సాయం తీసుకుని త‌ర్వాత ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య పురందేశ్వ‌రిని ప‌క్క‌న పెట్టేశారు. వాళ్లు ప‌లు పార్టీలు మారి ఇప్పుడు బీజేపీలో ఉండి మ‌ళ్లీ ఇద్ద‌రి అవ‌స‌రాల కోసం బాబుతోనే చేతులు క‌ల‌ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక ఇప్పుడు త‌న కుమారుడు లోకేష్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అడ్డు వ‌స్తాడ‌ని బాల‌య్య చిన్న‌ల్లుడు లోకేష్ తోడ‌ళ్లుడు భ‌ర‌త్‌ను సైతం చంద్ర‌బాబు ఎద‌గ‌నిస్తారా ? బాబు లాంటి వృక్షం ముందు భ‌ర‌త్ నిల‌బ‌డ‌తాడా ? లేదా నంద‌మూరి కుటుంబ స‌భ్యులను ఎలా అణ‌గ‌దొక్క‌బ‌డ్డారో బాబు కాలికింద అలాగే న‌లిగిపోతారా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చినా భ‌ర‌త్ గెల‌వ‌లేదు. త‌మ క‌మ్మ వ‌ర్గానికే చెందిన తూర్పు ఎమ్మెల్యే విశాఖ‌లో రెండో క‌మ్మ ప‌వ‌ర్ సెంట‌ర్ ఉండ‌కూడ‌ద‌ని భ‌ర‌త్‌కు కోప‌రేట్ చేయ‌లేద‌ని అంటారు. మ‌రి బాబు నిజంగా అదే నిజ‌మైతే వెగ‌ల‌పూడిపై యాక్ష‌న్ తీసుకోవాలి.. అలాంటిదేమి లేదు. అందుకే ఇప్పుడు కూడా ఖ‌చ్చితంగా గెలుస్తాడ‌నుకున్న భ‌ర‌త్ సీటు డౌట్లో ప‌డింది. ఏదేమైనా ఈ సారి కూడా భ‌ర‌త్ రిజ‌ల్ట్ తేడా కొట్టినా భ‌ర‌త్ పొలిటిక‌ల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డిపోయిన‌ట్టే..!