సెట్స్ లో చైతుకి గోరుముద్దలు తినిపిస్తున్న సందడి చేసిన సాయి పల్లవి.. అమ్మడి అల్లర్లు చూస్తే నవ్వేస్తారు (వీడియో)..!!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. అందం, అభిన‌యంతో ఏంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ.. అమ్మ‌డిని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి పలు సినిమా ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో నాగచైతన్య స‌ర‌సన తండేల్‌ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ.. బాలీవుడ్ లో రామాయణంతో పాటు మరో సినిమాతోను ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.

ఇక నేడు సాయి పల్లవికు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తండేల్‌ మూవీ యూనిట్ అమ్మ‌డి క్రేజీ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అసలు సిసలు మాస్‌లో ఆమెకు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ క్లిప్పింగ్ లో త‌న‌ క్యూట్ అండ్ ఫేవరెట్ హీరోయిన్ అల్ల‌ర్లు చూసుకుని తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. అయితే సాయి పల్లవి యాక్షన్ చెప్పాక ఎలా ఉంటుందో ఇప్పటివరకు అంతా చూశాం. కానీ క‌ట్ చెప్పిన తర్వాత ఆమె ఎలా ఉంటుందో చూస్తారా అంటూ సెట్స్ లో సాయి పల్లవి ఫన్నీ మూమెంట్స్ అన్నింటినీ వీడియోలో ప్రెసెంట్ చేశారు యూనిట్.

ఆమె ఏడిస్తే అంతా ఏడుస్తాం. ఆమె నవ్వితే అంతా నవ్వుతాం.. అంటూ డిఫరెంట్ మూడ్సులో ప్రజెంట్ చేసి ఆ వీడియోను ఫాన్స్ కు గిఫ్ట్ గా అందించారు మేకర్స్. ఈ వీడియోలో సాయి పల్లవి చేసిన చిలిపి అల్ల‌ర్లు అంద‌ర్ని నవ్విస్తాయి. వీడియో క్లిప్పింగ్ చివరిలో నాగచైతన్య చాలు అంటున్న సాయి పల్లవి అన్నం తినిపిస్తున్న సీన్ అయితే మరింత క్యూట్ గా అనిపిస్తుంది. చైతూకి రియల్ లైఫ్ పార్ట్నర్ ఈమె అయ్యి ఉంటే బాగుండేది అనిపించేంతలా సాయి పల్లవి వీడియోలో కనిపించింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.