టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ 2020లో ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ పెళ్లాడింది. గత ఏడాది ఈ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించగా.. అతనికి నీల్ కిచ్లూ అంటూ నామకరణం చేశారు. బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. ఫిట్ గా మారి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయింది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణకు జోడీగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ కేసరి` అనే సినిమా చేస్తోంది. బాలయ్య, కాజల్ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న `ఇండియన్ 2` లో భాగమైంది. మరోవైపు `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కమిట్ అయింది. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. ఇంకోవైపు ఫ్యామిలీ లైఫ్ ను కూడా కాజల్ బ్యాలెన్స్ చేస్తోంది. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా భర్త, కొడుకుతోనే టైమ్ స్పెండ్ చేస్తుంటుంది. తాజాగా కాజల్ తన ముద్దుల కొడుకు నీల్ తో కలసి ఎయిర్ పోర్ట్ లో మెరిసింది. దాంతో అక్కడే ఉన్న మీడియా వారు తల్లీకొడుకుల ఫోటోలను క్లిక్ అనిపించారు. బ్లాక్ డ్రెస్ లో మేకప్ లేకపోయినా కాజల్ ఎంతో అందంగా కనిపించింది. మరోవైపు నీల్ మాత్రం కోపంగా కనిపించాడు. సీరియస్ గా చూస్తూ లుక్స్ ఇచ్చాడు. అయినాకూడా నీల్ చాలా ముద్దుగా ఉన్నాడు. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఈ కాజల్, నీల్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.