కాంగ్రెస్‌లోకి బిగ్ లీడర్స్..మైలేజ్ పెరుగుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది. బలంగా ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీని గట్టిగా ఢీకొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో పార్టీ బలం మరింత పెంచేలా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల వరుసపెట్టి కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా మాజీ మాంత్రి ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. అటు బి‌ఆర్‌ఎస్ లోని కొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు చూస్తున్నారని తెలిసింది. ఎందుకంటే బి‌ఆర్‌ఎస్ లో సీటు దక్కకపోతే కాంగ్రెస్ లోకి జంప్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదే సమయంలో బి‌జే‌పిలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డి‌కే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం ఉంది. కాకపోతే ఇంతవరకు వారి చేరికపై క్లారిటీ రాలేదు. ఇక ఇటు బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కని కొందరు ఎమ్మెల్యేలు జంపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు.

ఇక అలాంటి వారు కాంగ్రెస్ లోకి వచ్చి సీటు సాధించాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వలసల వల్ల కాంగ్రెస్ లో సీట్ల పంచాయితీ పెరిగే ఛాన్స్ ఉంది. చేరికలు సరిగ్గా ఉంటే పార్టీకి మైలేజ్..లేదంటే మైనస్.