మహేష్ బాబు, కృష్ణవంశీ కాంబోలో మిస్సయిన మూవీ ఏంటో తెలుసా..?!

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈయన తెర‌కెక్కించిన‌ ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాదు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు కెరీర్‌లో ఎన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచినా ఆయన సినీ కెరీర్‌లో వచ్చిన మొట్ట‌మొదటి సూపర్ డూపర్ హిట్‌ మురారి సినిమా. ఇది మ‌హేష్ కెరీర్‌లోనే చాలా స్పెష‌ల్‌.

Murari (2001)

కాగా ఈ సినిమాకు కృష్ణవంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్పటివరకు మహేష్ బాబు రెండు మూడు సినిమాలు చేసినా.. అవి యావరేజ్ ట‌క్ తెచ్చుకున్నాయి. మురారి సినిమాతోనే ఆయన స్టార్ స్టేటస్ ద‌క్కించుకున్నాడు. ఇక ఆ మూవీ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమాతో మొదటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో మురారి సినిమా తర్వాత మహేష్ బాబు కృష్ణవంశీతో మరొక సినిమా చేయాలని భావించాడాట‌. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా సెట్స్‌పైకి రాలేదు.

When Krishna Vamsi differed with Mahesh Babu?

దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొ సినిమా లేకుండాపోయింది. నిజానికి మహేష్ బాబు తనకు సక్సెస్ ఫుల్ సినిమాలను అందించిన డైరెక్టర్ తో ప‌దే ప‌దే సినిమా చేస్తూ ఉంటాడు. అలానే ఈయనతో కూడా మరో సినిమాని కూడా చేయలని భావించాడ‌ట‌. కానీ అనుకోని కారణాల వల్ల ఆమూవీ పట్టాలెక్కలేదు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించేది అంటూ మహేష్ అభిమానులు త‌మ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కృష్ణవంశీ, మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం లేదన‌టంలో సందేహం లేదు.