“ఆ ప్రభాస్ గాడి సినిమా ఫ్లాప్ అవుతుంది..ఇది తధ్యం”..హీట్ పెంచేస్తున్న సోషల్ మీడియా పోస్ట్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ కంటే ముందే సినిమాకి సంబంధించిన రివ్యూస్ ఎలా వైరల్ అవుతున్నాయో.. ట్రెండ్ అవుతున్నాయో మనం బాగా చూస్తూ వస్తున్నాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉమర్ సైంధు పలు సినిమాలపై ఎలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటాడు కూడా మనం గమనించవచ్చు . కేవలం సినిమాలపైనే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ పై కూడా చీప్ గా వల్గర్ గా టాప్ సీక్రెట్స్ ని బయట పెట్టేస్తూ ఉంటాడు.

కొంతమంది ఆయనను బూతులు తిడుతూ ఉంటారు . అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాడు. ప్రభాస్ కెరియర్ లో వన్ ఆఫ్ ద ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి . ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు . అంతేకాదు ఈ సినిమా కోసం నాగ్ అశ్వీన్ రాత్రి పగలు నిద్ర లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

జూన్ 27వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా ఫస్ట్ కాపీ ఆల్రెడీ మేకర్స్ చూసేసారు అని .. ఈ సినిమా టాక్ డిజాస్టర్ గా వస్తుంది అని.. ఆల్రెడీ ఇన్సైడ్ రిపోర్ట్స్ ద్వారా మ్యాటర్ లీక్ అయిందట . ఇదే విషయాన్ని ఓపెన్ గా ట్విట్టర్ ద్వారా బయట పెట్టాడు ఉమర్. దీంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . నోరు మూసుకో ..నీ ఫేస్ కి అంత సీన్ లేదు అంటూ ఘాటుగా స్పందిస్తూ ఉంటే.. మరికొందరు నువ్వు చెప్పేటి అన్ని అబద్ధాలే .. నువ్వు హిట్ అంటే ఫ్లాప్ ..ఫ్లాప్ అంటే హిట్ మా ప్రభాస్ అన్న కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు..!!