ఎవ్వరు ఊహించని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్.. మరో అర్జున్ రెడ్డి లాంటి హిట్ పక్క..!

విజయ్ దేవరకొండ ..ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రౌడీ హీరో.. ఆటిట్యూడ్ హీరో.. టాలెంటెడ్ హీరో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరో ..ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో విజయ్ దేవరకొండ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . చాలా మంది హీరోలు సినిమా ఫ్లాప్ అయిపోతే బాధ పడిపోతూ ఉంటారు. అయ్యయ్యో అంటూ దిగులు పడుతూ ఉంటారు . కానీ విజయ్ దేవరకొండ విషయంలో వెరీ స్పెషల్ . తన సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడి వర్క్ చేస్తాడు .

ప్రజెంట్ విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ లాస్ట్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. దారుణాతి దారుణమైన డిజాస్టర్ టాక్ అందుకుంది . అయితే నెక్స్ట్ విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్ ఏ డైరెక్టర్ కి కమిట్ అవ్వబోతున్నాడు అనే విషయం చాలా చాలా వైరల్ అయింది . దిల్ రాజు నిర్మాణంలో అయితే ఒక సినిమా చేస్తున్నాడు అంటూ గట్టిగా ప్రచారం జరిగింది .

అదే విషయాన్ని కన్ఫామ్ చేసేసారు మేకర్స్ . దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . రాజా వారు రాణి గారు సినిమాతో దర్శకుడిగా మారిన రవికిరణ్ కోలా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించింది . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ను మనం అర్జున్ రెడ్డి సినిమాకి మించిన రేంజ్ లో చూడబోతున్నాం అంటూ కూడా ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ సినిమాగా తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!!