విరాట్-అనుష్కల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? అందుకే అంత అన్యోన్యంగా ఉంటారా..?

ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలు ఉన్న అందరికీ చాలా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటారు విరాట్ కోహ్లీ అదేవిధంగా అనుష్క శర్మల జంట . వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. క్యూట్ కపుల్.. రొమాంటిక్ కపుల్ ..లవబుల్ కపుల్ .. అండర్స్టాండింగ్ కపుల్.. వామ్మో ఈ జంటలా ఎవరు ఉండలేరు . అది అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒక్కొక్క ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు. విరాట్ కోహ్లీ టీమిండియాలో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ బ్యూటీ .

2017లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు . అప్పటివరకు వీళ్లు గుట్టూచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపారు . అయితే మీడియాలో వీళ్ళ ప్రేమ గురించి వార్తలు వినిపించిన.. పలు ఇంటర్వ్యూలలో ఆ ప్రశ్న ఎదురైన నో.. అదేం లేదు అంటూ కొట్టి పడేశారు. ఫైనల్లీ పెళ్లి చేసుకొని ఒక్కటి అయ్యారు . ఇటీవల అనుష్క శర్మ – కోహ్లీ పండంటి మగ బిడ్డకి కూడా జన్మనిచ్చారు. ఆల్రెడీ అంతకుముందు ఒక పాపకు జన్మనిచ్చారు . ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట .

రీసెంట్గా అనుష్క శర్మ..విరాట్ కోహ్లీ .. ఆర్ బి సి ప్లేయర్లతో కలిసి తన పుట్టినరోజును గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఆ ఫొటోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. దీంతో వాళ్ళ మధ్య ఏజ్ ఎంత గ్యాప్ ఉంది అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అసలు అనుష్క ఏజ్ ఎంతో తెలుసా..? ఆమె రీసెంట్ గానే 36వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది . ఈ భామ విరాట్ కంటే ఆరు నెలలు నాలుగు రోజులు పెద్దదట . అనుష్క శర్మ మే 1 , 1988లో జన్మించింది . విరాట్ కోహ్లీ 5 నవంబర్ 1988లో ఢిల్లీలోని పంజాబ్ కుటుంబంలో జన్మించాడు . ఇప్పుడు 35 ఏళ్లు విరాట్ కి ..అనుష్కకు 36 ఏళ్లు ఈ జంటకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!!