యూఎస్‌లో ‘ స‌లార్ ‘ మానియా కమ్మేసింది.. ప్ర‌భాస్‌ మైకంలో ఓవ‌ర్సీస్ ఫ్యాన్స్‌..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న సినిమా ‘ సలార్ ‘. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ రిలీజ్‌కి ఈ సినిమా సిద్ద‌మౌతుంది.

ఈ నేప‌ద్యంలో ఓవర్సీస్ రిలీజ్ పై యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వాళ్ళు ఓ క్రేజీ అప్డేట్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇదివరకే యూఎస్ లో ఉన్న సినీ మార్కెచైన్‌ అన్నిటిలో కూడా స‌లార్‌ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించగా.. ఇప్పుడు యూఎస్ లో ఉన్న మార్కస్ థియేటర్స్ చైన్ అన్నిటిలో కూడా సలార్‌ సినిమా విడుదల కాబోతుందని అనౌన్స్ చేశారు.

దీంతో ఈ పాన్ ఇండియా సినిమా యుఎస్ మొత్తాన్ని కమ్మేసింది అని చెప్పాలి. రవి బసృర్‌ సంగీతం అందించగా, హంబలేస్ ఫిల్మిస్‌ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రేక్షకులు ఊహించిన రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందో? లేదో? చూడాలి.