మెగాస్టార్ చిరంజీవి నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రం `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. చిరంజీవి రీమేక్ సినిమాలు చేయడం మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదు. ఆల్రెడీ గాడ్ ఫావర్ విషయంలో దెబ్బ పడింది. మళ్లీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తొలి ఆట నుంచే నెటిజన్లు రివ్యూలు వెల్లువెత్తాయి.
టాక్ అనుకూలంగా లేకపోవడంతో భోళా శంకర్ డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ది ఘోస్ట్ తర్వాత అక్కినేని నాగార్జున నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే మలయాళ హిట్ మూవీ `పొరింజు మరియం జోస్` రీమేక్ చేయాలని నాగార్జున ఆలోచనలో ఉన్నారు.
నాగార్జున స్ట్రైయిట్ సినిమాలు కాకుండా రీమేక్స్ వైపు అడుగులు వేయడం అక్కినేని ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో రీమేక్ లు ఏ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వడం లేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన భోళా శంకర్ మరోసారి రుజువు చేసింది. చాలా మంది హీరోలకు ఒక పాఠంలా నిలిచింది. భోళా శంకర్ రిజల్ట్ తో నాగ్ మనసు మార్చుకున్నాడు. పొరింజు మరియం జోస్ రీమేక్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం స్ట్రైట్ కథను ఎంపిక చేసుకునే పడ్డాడని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.