బెయిన్ స్ట్రోక్ ఎందుకు వ‌స్తుంది… చికిత్స ఎలా…!

మెదడు కణాలకు కావలసిన ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, రక్తనాళాలు దెబ్బతినడం, రక్తస్రావం జరగడం రక్త సరఫరా ఆగిపోయి దానంతట తిరిగి ప్రారంభమవడం లాంటి సమస్యల కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది.

అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మద్యపానం, ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం, ఉబకాయం, ఆందోళన చెందడం, గుండె వ్యాధులు లాంటివి బ్రెయిన్ స్ట్రోక్ కారణం అవుతాయి. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. కానీ జన్యు సంబంధిత కారణాలు, ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడం వల్ల మ‌రోసారి స్ట్రోక్‌ని కలిగిస్తాయి.

చికిత్స ఎలా:
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించండి. సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురవకుండా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. బిపి, షుగర్ వంటివి ఉంటే మరింత జాగ్రత్త పడాలి.

స్ట్రోక్ నుంచి నెల ముందే కాపాడొచ్చు:
బ్రెయిన్ స్ట్రోక్ కు నెల ముందే వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చు. ముఖం, చేతులు, కళ్ళు మొద్దు బారిపోవడం వంటివి సాధారణ లక్షణాలే అయినా, బ్రెయిన్ స్ట్రోక్ ముందు ఇలా జరుగుతూ ఉంటుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్ళు మస్కబారి పోతాయి. ఇలా జరుగుతుందని 1300 మందిపై ఇటీవల జరిపిన ఓ సర్వేలో తెలిసింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లు కనిపించిన మరో లక్షణం తలనొప్పి. ఒక్కో సమయంలో విపరీతమైన తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటి సమస్యలు ఉంటే వెంటనే స్కానింగ్ తీపించుకోండి.