అడ్డంగా దొరికిపోయిన కూతురు భాయ్‌ఫ్రెండ్‌.. చీపురుతో చిత‌క్కొట్టిన త‌ల్లి ( వీడియో)

తల్లిదండ్రులు లేని సమయంలో బాయ్ ఫ్రెండఃని ఇంటికి పిలిచి ఎంజాయ్ చేయాలనుకుంది ఓ యువ‌తి. తల్లిదండ్రులు సడన్గా ఇంటికి రావడంతో షాక్ అయినా ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక ప్రియుడిని బాల్కనీ నుంచి పారిపోమని సజెస్ట్ చేసింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకి దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపిరి కట్ట తిరగేసి చిదగబాదింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. దొంగ చాటుగా తన గర్ల్ ఫ్రెండ్ గదిలోకి దూరిన యువకుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతనీ ఎలాగోలా సేవ్ చేయాలనే ఉద్దేశంతో బట్టలు బాల్కనీ నుండి కిందకు విసిరేసి తాడిపట్టుకుని కిందకి వెళ్లిపోమని సలహా ఇచ్చింది. మెల్లగా తాడిపట్టుకుని కిందకి జారుతున్న యువకుడిని చూసిన తల్లి కింద ఫ్లోర్ లోని విండో ఓపెన్ చేసి చీపిరి కట్టతో చితకొట్టేసింది.

పాపం ప్రియుడు ఏమాత్రం పట్టు తప్పిన అతడు కింద పడేలోపే ప్రాణాలు గాల్లో పోవడం ఖాయం అనే విధంగా ఆ వీడియో ఉంది. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోని అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ వ్యూస్ రావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.