“వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు”.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన నీహారిక..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పేరు తర్వాత బాగా ట్రోలింగ్కి గురైన పేరు ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా నిహారిక కొణిదెలా అని చెప్పాలి . మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా ట్రై చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ . అయితే ఆమె సక్సెస్ కాలేకపోయింది . అంతేకాదు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంది . పెళ్లి కూడా పెటాకులు అయిపోయింది .

జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న నిహారిక చాలా తక్కువ టైంలోనే విడాకులు తీసేసుకుంది . ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం .అయితే విడాకులు తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిహారిక తనపై జరిగే ట్రోలింగ్ కి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నిహారికను హోస్ట్ ప్రశ్నిస్తూ “మీపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.. దానిపై మీ సమాధానం ..?”అని ప్రశ్నించగా..

నిహారిక చాలా చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . “అలాంటివి నాకు అనవసరం.. నేను పడే బాధలు వాళ్ళు చూడరు కదా ..నాకు మా అమ్మ – నాన్న – అన్న వీళ్ళ ఒపీనియన్సే ముఖ్యం ..వీళ్లు నాతో ఉన్నంతవరకు నన్ను ఎవరు కూడా ఏం పీకలేరు ..వాళ్ళు చేసే ట్రోలింగ్ వాళ్ళు చేసుకునివ్వండి .. నాకు ఏ ఫరాక్ పడదు అనే రేంజ్ లో ఓ రేంజ్ ఘాటుగా స్పందించింది”. దీంతో సోషల్ మీడియాలో నిహారిక చేసిన కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే నిహారిక మాట్లాడిన మాటలను కొంతమంది అమ్మాయిలు సపోర్ట్ చేస్తూ ఉండడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం..!!