టాలీవుడ్ లో ఆ ఒక్క హీరోకి తప్ప అందరికీ హిట్ ఇచ్చిన శృతిహాసన్.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?!

శృతిహాసన్ కెరీర్ స్టార్టింగ్‌లో ప‌లు సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి.. తాను న‌టించిన‌ ప్రతి సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. తమిళ్‌లో హే రామ్ అనే మూవీతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు తెలుగు ఈడియ‌న్స్‌కు అనగనగా ఒక ధీరుడు సినిమాతో ప‌రిచ‌యం అయ్యింది. ఈ మూవీలో సిద్ధార్థ్ సరసన నటించింది. కాగా ఇది ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో మరోసారి ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో నటించిన ఇది యావ‌రేజ్ టాక్ ద‌క్కించుకుంది. కాగా శృతిహాసన్ కు మొట్టమొదటిసారి టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందింది.

Shruti Haasan opens up about Chiranjeevi, Balakrishna pairing trolls -  Telugu News - IndiaGlitz.com

తమిళ్లో ధనుష్‌తో త్రి మూవీతో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాతో సక్సెస్ బాట మొదలైంది. ఇలా పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్‌తో.. బాలకృష్ణకు వీరసింహారెడ్డి తో, అల్లు అర్జున్ కు రేసుగుర్రంతో వరుస హిట్లను అందించింది. అలాగే చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో ఆగడు ఫెయిల్ అయినా.. శ్రీమంతుడుతో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక నాగచైతన్యకు కూడా ప్రేమమ్ మూవీతో ఓ మాదిరి సక్సెస్ అందించింది.

Ramayya Vastavayya HQ Movie Wallpapers | Ramayya Vastavayya HD Movie  Wallpapers - 11756 - Oneindia Wallpapers

రవితేజకు క్రాక్ మూవీతో హిట్ ఇచ్చింది. ప్రభాస్‌కు సలార్ తో హిట్ దక్కింది. ఇలా ఇంతమంది స్టార్ హీరోలకు సక్సెస్ అందించిన ఈ ముద్దుగుమ్మ ఒకే ఒక్క స్టార్‌ హీరోకు మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ హీరో మరెవరో కాదు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్. రామయ్య వస్తావయ్యతో వీరిద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలవడంతో అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలోను నటించలేదు.