“వేల కోట్ల ఆస్తి.. కానీ, చిన్న ఇంట్లోనే ఫ్యామిలీ”.. ఈ హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎలా జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతూ ఉంటాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్స్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు జనాలు . తాజాగా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోకి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది .

అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆ వార్తను తెగ ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . సాధారణంగా స్టార్ సెలబ్రెటీస్ లగ్జరీయస్ లైఫ్ ని గడుపుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే బాడీగార్డ్స్ ని పెట్టుకొని కాలు కింద పెట్టనీకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు . అయితే వాళ్లందరిలోకి డిఫరెంట్ ఈ హీరో. 2900 వేల కోట్లకు అధిపతి అయినా సరే చిన్న ఇంట్లో తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ హీరో .

ఆయన ఎవరో కాదు సల్మాన్ ఖాన్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ..టోటల్ ఆస్తి 2900 కోట్లకు పైగానే ఉంటుంది . అయితే ఈ హీరో ఒక సింగిల్ బెడ్ రూమ్లో నివాసం ఉంటూ ఉండడం ఫాన్స్ కి సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . ఒక్కొక్క సినిమాకి కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకునే ఈ హీరో చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడతారట . అందుకే ఎంత డబ్బులు సంపాదించిన సరే తనకి ఎంత అవసరం ఆ విధంగానే బ్రతుకుతూ ఉంటాడట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ జనాలు బాగా ట్రెండ్ చేస్తున్నారు. రియల్ హీరో అంటే నువ్వే అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!