24 ఏళ్ల బాండ్ మాది.. విడాకులపై అలాంటి కామెంట్స్ దారుణం.. సింగర్ సైంధవి ఎమోషనల్ పోస్ట్..?!

తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా మంచి పాపులారిటి దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి ఇటీవల విడాకులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విడాకుల మ్యాటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నామంటూ అనౌన్స్ చేయడంతో నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అలాగే వీరి ప్రేమ, పెళ్లి, డివోర్స్ గురించి మీమ్స్ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇదివరకే ఈ కామెంట్స్ పై జీవి ప్రకాష్ స్పందించాడు. తమ వ్యక్తిగత జీవితాల గురించి దిగజారి మాట్లాడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక తాజాగా జీవి ప్రకాష్ మాజీ సతీమణి సైంధవి తమ విడాకుల ట్రోల్స్‌ పై స్పందించింది.

GV Prakash and Saindhavi to get divorced? | Tamil Movie News - Times of  India

తమ గురించి వస్తున్న కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయని.. ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంది. జీవి ప్రకాష్ కుమార్ తమిళ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సింగర్ సైంధవ జీవి ప్రకాష్ కు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్. ఆ తర్వాత వీర స్నేహం ప్రేమగా మారడంతో 13 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. పెద్దల సమక్షంలో 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప (అన్వీ) ఉంది. కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత అన్యోన్యమైన ప్రేమజంటగా క్రెజ్‌ సంపాదించుకున్న వీళ్ళు 11 ఏళ్ల వైవాహిక జీవితానికి తాజాగా ముగింపు పలుకుతూ డివోర్స్ అనౌన్స్ చేయ‌డంతో.. దీనిపై వస్తున్న ట్రోల్స్‌కు తాజాగా స్పందించింది సైంధవి.

அடுத்தவர்களால் எங்களுக்கு விவாகரத்து ஆகவில்லை!" 24 வருட நட்பு இனி..!  சைந்தவி திடீர் பதிவு | GV Prakash wife Saindhavi new insta post - Tamil  Oneindia

ఎలాంటి ఆధారాలు లేకుండా మా విడాకులపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాయి. అది చాలా బాధగా అనిపిస్తుంది. ప్రైవసీ కావాలని చెప్పిన ఇలాంటివి చేయడం దారుణం. మా గురించి తప్పుడు వార్తలు సృష్టించి మమ్మల్ని బాధ పెట్టకండి. ఈ నిర్ణయం ఇద్దరం కలిసి తీసుకున్నాం. మా ఇద్దరికీ 24 ఏళ్ల స్నేహబంధం.. మేము ఇప్పటికీ మంచి స్నేహితులమే అంటూ నోట్ షేర్ చేసుకుంది. ఇక సైంధవి షేర్ చేసిన ఈ నోట్ జీవి ప్రకాష్.. రీ ట్విట్ చేస్తూ దయచేసి అలాంటి వార్తలను ఆపేయండి అంటూ వివరించాడు. ప్రస్తుతం వీరు చేసిన ఈ ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది.