ఫైనల్లీ ..పెళ్లికి రెడీ అయిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్.. అమ్మాయి ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు అనగానే అందరూ కళ్ళు మూసుకునే టక్కును మొదటి చెప్పే పేరు ప్రభాస్ . ఆరడుగుల అందగాడు .. ఆ అందానికి తగ్గ కటౌట్ కూడా అద్దిరిపోయే రేంజ్ లోనే ఉంటుంది . అలాంటి కుర్రాడిని ఎవరైనా మిస్ చేసుకుంటారా..? నో వే.. ఇన్నాళ్లు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా..? ఎప్పుడవుతుందా..? అంటూ వేయికళ్లతో వెయిట్ చేశారు ఫ్యాన్స్ . ఫైనల్లీ ఆ మూమెంట్ రానే వచ్చేసింది .

రీసెంట్ గానే ప్రభాస్ తన లైఫ్ లోకి రాబోతున్న స్పెషల్ పర్సన్ గురించి అధికారికంగా చెప్పబోతున్నట్లు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని తన మ్యూజిక్ తో ఓ ఊపు ఊపేసిన దేవిశ్రీప్రసాద్. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . దేవిశ్రీప్రసాద్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. దేవి శ్రీ ప్రసాద్ తన మరదలిని పెళ్లి చేసుకోబోతున్నారట.

గతంలో ఛార్మీ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి ..వాటిని పెద్దగా పట్టించుకోలేదు దేవిశ్రీప్రసాద్ . అయితే ఇన్నాళ్ళకి పెళ్లి పై ఇంట్రెస్ట్ కలిగినట్టుంది .. అందుకే లేటు వయసులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు జనాలు . మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ అదేవిధంగా దేవిశ్రీప్రసాద్ ఒకేసారి పెళ్లి పీటలు ఎక్కబోతు ఉండడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి ఖుషి అవుతున్నారు . అయితే దీనిపై ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ స్పందించకపోవడం గమనార్హం . అందరిలాగే తాళి కట్టే ముందు రోజు పెళ్లిని అనౌన్స్ చేస్తారా ఏంటి అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!