టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న సినిమాలతోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్.. వరుస విజయాలను అందుకుంటు స్టార్ హీరోగా మారాడు. ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తను నటించే అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్న చరణ్.. ప్రతి సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలని ఉద్దేశంతో ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడట. ఇక చరణ్ నటించే ప్రతి సినిమాతోనూ ఏదో ఒక వైవిధ్యమైన కథంశాని ఎంచుకుంటూ ఉంటాడు.
ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లో అందుకున్నాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ కథను రిజెక్ట్ చేసి తప్పు చేశాడు అంటూ సినీవర్గాలు చెప్తున్నాయి. ఇంతకీ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ ఏంటో ఒకసారి చూద్దాం. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాగూర్ ప్రధాన పాత్రలో నటించిన సీతారామం మూవీ.. రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదట ఈ సినిమా కథను రాంచరణ్ తో తీయాలని భావించారట మేకర్స్. కానీ రామ్ చరణ్ తన ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమా లేదనే ఉద్దేశంతో కథను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
కాగా నిజంగానే ఈ కథ రామ్ చరణ్ ఇమేజ్‌కు అసలు సెట్ అయ్యేది కాదు. అప్పుడు చరణ్ ఇమేజ్కు తగ్గట్టుగా కాస్త కథను చేంజ్ చేయాల్సి వచ్చేది. అలాంటి క్రమంలో సినిమా సక్సెస్ అయ్యేదో లేదో ఎవరు చెప్పలేరు. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అయితే తర్వాత ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ ను సెలెక్ట్ చేసుకోవడం.. ఈ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో ఏదేమైనా రాంచరణ్ కంటే దుల్కర్ సల్మాన్ ఈ పాత్రలో బాగా సెట్ అవుతారు. ఆయనను తప్ప వేరే హీరోను ఈ పాత్రలో ఊహించుకోలేము అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.