పెళ్లి తరువాత ఫస్ట్ టైం ఆ పని చేయబోతున్న ఎన్టీఆర్.. ఫుల్ తెగించేశాడుగా..!

మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. దాన్నంతటికి కారణం ఆర్ ఆర్ ఆర్ అని చెప్పక తప్పదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు . ఇద్దరు కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. కాగా దేవర సినిమాలో ఎన్టీఆర్ ..జాన్వీ తో రొమాన్స్ చేయబోతున్నాడు . అయితే పెళ్లి తర్వాత ఎప్పుడు కూడా హద్దులు మీరని ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ సినిమాలో ఫుల్ టు ఫుల్ డీప్ రొమాంటిక్ సాంగ్ లో నటించబోతున్నారట. ఆల్ రెడీ కొరటాల శివ ఈ విషయం తారక్ కి చెప్పారట.

ఆయన స్పెషల్ గా అడిగినందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చేశారట. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం అలాంటి సాంగ్లో నటించేందుకు ఓకే చేశారట తారక్. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది . లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ హద్దులు మీరిన సీన్స్ మనం చూడలేదు . అయితే ఫస్ట్ టైం ఫుల్ టు ఫుల్ ఈ రొమాంటిక్ సాంగ్ లో నటించడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!