కెవ్వు కేక.. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ టైటిల్ ఇదేనా..? ఊర నాటు మాస్ రా బాబోయ్..!

ఈ మధ్యకాలంలో సినీ మేకర్స్ సినిమాలు డైరెక్ట్ చేయడం కన్నా కూడా సినిమాకి ఎలాంటి పేరు పెట్టాలి అన్నదానిపై మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దానికి రీజన్స్ ఏంటో కూడా మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక విషయం బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వాలి అంటే దానికి ఇంపార్టెంట్ టైటిల్. కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా టైటిల్ వైరల్ గా మారింది .

మనకు తెలిసిందే ప్రెసెంట్ దేవర అదే విధంగా వార్ 2 సినిమా లను సెట్స్ పైకి తీసుకొచ్చిన తారక్ త్వరలోనే ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం అద్భుతమైన టైటిల్ ని ఫిక్స్ చేశాడట ప్రశాంత్ నీల్. అంతేకాదు ఆ తైటిల్ ని ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా అనౌన్స్ చేయబోతున్నారట.

అయితే ప్రశాంత్ నీల్ సినిమాలకి ఎలాంటి టైటిల్స్ పెడతారు అన్న విషయం తెలిసిందే.. చాలా చాలా రియలిస్టిక్ గా..ఢిఫరెంట్ గా ఉండే విధంగా పెడతారు . కాగా ఇప్పుడు ఎన్టీఆర్ 31 సినిమాకు గాను “డ్రాగన్” అనే ఒక పవర్ఫుల్ టైటిల్ను పెట్టినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది . ఈ టైటిల్ నందమూరి అభిమానులకి కూదా నచ్చేసింది. ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ చాలా చాలా కేర్ ఫుల్ గా ఉన్నారట. ప్రతి సీన్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలి అనుకుంటున్నారట.