“ఇక నోర్లు మూయండి రా”.. ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిన రాజమౌళి..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని ఫేక్ వార్తలు ఎటువంటి నష్టం క్రియేట్ చేయకపోయినా కొన్ని ఫేక్ వార్తలు మాత్రం సినీ మేకర్స్ కు భారీ నష్టాలు క్రియేట్ చేస్తాయి. అయితే తాజాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సినీ ఇండస్ట్రీలోని జనాలకు షాకింగ్ కి గురయ్యేలా చేసింది. ఎప్పుడు కూడా ఈ సినిమాలో ఆ హీరోయిన్ వాళ్లు ..వీళ్లు అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది .

కానీ రాజమౌళి – మహేష్ బాబు సినిమా విషయంలో కూసింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సోషల్ మీడియా స్టార్స్ . రీసెంట్గా ఇంగ్లీష్ వెబ్సైట్ ఈ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్ వీరెన్ స్వామి పనిచేస్తున్నట్లు వార్తలు రాశారు . దీనిపై అధికారికంగా స్పందించింది చిత్ర యూనిట్ . చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ నుంచి తాజాగా ఓ అధికారిక లేక విడుదల చేశారు . “ఎస్ఎస్ రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో రాబోయే సినిమా కోసం కాస్టింగ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు”.

” అయితే వైరల్ అవుతున్న సోషల్ మీడియాలోని వార్త లో ఎటువంటి నిజం లేదు అని అది స్పష్టం చేసేందుకే ఈ లేఖను విడుదల చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ సినిమా విషయంలో రాజమౌళి సైతం కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాపై త్వరలోనే నటీనటులకు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయబోతున్నారట. ఫేక్ వార్తల నేపధ్యంలోనే కోపంతోనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా మొత్తం ముగ్గురు బ్యూటీస్ నటిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. చూద్దాం త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోబోతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఇంకా ఎంత పకడ్బందీగా ప్లాన్స్ వేస్తారు అనేది చూడాలి. అయితే రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో “ఇక నోర్లు మూయండి రా”.. ఒక్కోక్కడికి ఇచ్చిపడేసేచ్రేంజ్ లో రాజమౌళి అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!!