తన ఇన్స్టా వేదికపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్.. పెళ్లి గురించేనా..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. వరుస సినిమాలను ఆడియన్స్‌కు అందిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ గా అందరినీ ఆకట్టుకుంటున్న ప్రభాస్.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇంకా సింగల్ గానే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అభిమానులంతా ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి బాట పెట్టలేదు.

TOLLYWOOD® on X: "Shyamala Devi says, Prabhas has promised for marriage 🤔  Read More: https://t.co/cmc1vdfDPJ #Prabhas #ShyamalaDevi  https://t.co/BKaHYbP2Lu" / X

పెళ్లి మాటని పక్కన పెట్టేసి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదిలో కన్ఫామ్ గా జరిగిపోతుందంటూ ఇటీవల ఓ ఈవెంట్లో వివరించింది. దీంతో ఆశగా ఎదురుచూడడం మానేసిన అభిమానుల్లో మరోసారి ప్రభాస్ పెళ్లి పై ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ అందరికీ మ్యారేజ్ గురించే సంకేతం ఇస్తున్నాడు అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి.

ప్రభాస్ తన ఇన్‌స్టావేదికగా.. ఫైన‌లీ ఓ ఇంపార్టెన్ట్ వ్యక్తి మన లైఫ్ లోకి రాబోతున్నారు డార్లింగ్స్.. వెయిట్ చేయండి.. అంటూ తన స్టోరీలో రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ చూసిన అభిమానులు ప్రభాస్ పెళ్లి గురించి ఈ పోస్ట్ అని అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు..? ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్ లోకి రాబోతుందా.. లేదా ప్రొఫెషనల్ లైఫ్ లోకా.. అనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 44 ఏళ్ళ వయసు దాటుతున్న ప్రభాస్ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు. అయితే ఫూచ‌ర్‌లో అయ్యినా ప్రేమ పెళ్ళా లేదా పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటారా అనేదానిపై కూడా క్లారిటీ లేదు.