బాలయ్య అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు NBK109 నుంచి రెండు క్రేజీ అప్డేట్స్..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడెప్పుడు సినిమా టీజర్, టైటిల్ మేకర్స్ రిలీజ్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే బాలయ్య పుట్టినరోజు రానుంది. జూన్ 10న‌ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు క్రేజీ అప్డేట్స్ ఒకే రోజున రిలీజ్ చేయల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ రెండు అప్డేట్స్ ఒకే రోజు వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు. ఇక పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.

Nandamuri Balakrishna's NBK 109 Goes on Floors

బాలయ్యతో సినిమాలను నిర్మించడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. అంతకంతకు ఆయన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ వెళుతున్న బాలయ్య.. ఆయన క్రేజ్‌కు త‌గ్గ‌ రెమ్యూనరేషన్ తీసుకోకుండా కేవలం రూ.30 కోట్లల్లో పారితోష‌కం అందుకుంటూ సినిమాల్లో నటించడంతో నిర్మాతలు కూడా లాభాలా బాటపడుతున్నారు. ఈ క్రమంలో బాలయ్యకు ఎక్కువగా సినిమా అవకాశాలు ఇచ్చేందుకు మరింత ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోస్ సినిమాల్లో నటిస్తున్నా.. మాస్ కథ‌ అంశాలతో బాలయ్య ఇంపాక్ట్ ఉన్నట్టుగా వారి సినిమాలు ఉండడం లేదు. దీంతో బాలయ్య మాస్ కథ‌ అంశాలను ఎంచుకుంటూ మరింతగా దూసుకుపోతున్నాడు.

NBK 109 Glimpse : సింహం నక్కల మీదికి వస్తే వార్ అవ్వదురా.. బాలయ్య మూవీ  గ్లింప్స్ మామూలుగా లేదుగా

బాలయ్యకు మాస్ సినిమాలు ఎంతగానో ప్లస్ అవుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక బాలయ్యకు జోడిగా నటించే అవకాశం వస్తే బాగుండని ఎంతోమంది హీరోయిన్స్ ఆరాట‌పడుతున్నారు. బాలయ్య, బాబి కాంబోలో మెయిన్ హీరోయిన్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టిన క్రమంలో ఈ సినిమా హిట్ అయితే బాలయ్య రేంజ్ వేరే లెవెల్ లో ఉంటుందన్నంలో సందేహం లేదు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న బాలయ్య.. వరుస హిట్లు అందుకుంటూ హ్యాట్రిక్ తో దూసుకుపోతున్నాడు. ఇక సినిమాల లుక్ విషయంలో సైతం బాలయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.