ప్రముఖ స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేవలం సినిమాలోనే కాకుండా.. మోడలింగ్ లోను తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుని ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. చాలా సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరుపులు మెరిపిస్తుంది. అలాగే 2024 రెడ్ కార్పెట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లోను దేవకన్యలా ముస్తాబై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. ఆమె చేతికి గాయమై కట్టు ఉన్నా ఆ చేతికట్టుతోనే రెడ్ కార్పెట్ పై అందాలు వెదజల్లుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఐశ్వర్య ప్రస్తుతం కేన్స్ రెడ్ కార్పెట్ పై దిగిన పిక్స్ వైరల్ గా మారాయి. పెళ్ళై ఇన్నేళ్లయినా ఆమె అందం ఏమాత్రం తరగలేదు.. అలాగే ఆమె కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంత పెద్ద కూతురు ఉన్న ఇప్పటికి తరగని ఆమె అందానికి ఫీదా అవుతున్నారు. ఐశ్వర్య బుధవారం రాత్రి ముంబై విమానాశ్రయంలో గాయంతో చేతికి కట్టు వేసుకొని కనిపించింది. అయితే ఆమె చేతికి ఏదో అయ్యిందని అభిమానులంతా నిరాశ చెందారు. దీంతో ఈసారి ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఆమె అడుగుపెట్టదేమో అని సందేహాలు కూడా వారిలో మొదలయ్యాయి.
అయితే ఐశ్వర్య మాత్రం తన కమిట్మెంట్ ఎలా ఉంటుందో చాటింది. తన చేతికి గాయమైన దానిని లెక్క చేయకుండా ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది. బ్లాక్, వైట్, గోల్డెన్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేయించిన గౌన్ ధరించి రెడ్ కార్పెట్ పై దర్శనం ఇచ్చింది. అయితే ఈమె.. కెన్స్ ఫెస్టివల్ లో మెరపడం ఇప్పుడు కొత్తమే కాదు. 2002లో మొదటిసారిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టిన ఐశ్వర్య.. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది తన వినూత్నమైన స్టైల్ తో రెడ్ కార్పెట్ పై నడుస్తూనే ఉంది. అలా ఇప్పటివరకు ఐశ్వర్య మొత్తంగా ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై 21సార్లు నడిచి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈసారి గాయాన్ని కూడా లెక్కచేయకుండా కార్బెట్ పై స్టెప్పులు వేసి చిరునవ్వులతో ఫోజులు ఇస్తు అందరిని ఫిదా చేసింది.