విశ్వంభర సినిమా నుంచి త్రిష న్యూ పోస్టర్ రిలీజ్..ఎంత అందంగా ఉందో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిషకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు . ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ . వయసు 40 పైబడిపోయిన సరే ఇప్పటికీ సెక్సీ ఫిగర్ తో కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇస్తూనే ఉంది . ఇండస్ట్రీలో 20 ఏళ్ల యంగ్ బ్యూటీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో అంతకు డబల్ స్థాయిలో త్రిష అందాలతో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం .

 

కాగా రీసెంట్గా హీరోయిన్ త్రిష తన 41 పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె వర్క్ చేస్తున్న సినిమాకి సంబంధించిన సరికొత్త లుక్స్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగులో ప్రజెంట్ హీరోయిన్ త్రిష విశ్వంభర అనే సినిమాలో నటిస్తుంది . మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ వీళ్లిద్దరూ స్టాలిన్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

మరోసారి అదే కాంబోను రిపీట్ చేశాడు డైరెక్టర్ వశిష్ట. నేడు త్రిష బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు . చాలా ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే రేంజ్ లో కుందనపు బొమ్మలా కనిపించింది . చూడగానే ముద్దొస్తూ చాలా చక్కగా అందంగా కనిపించింది . దీంతో త్రిష ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. కుర్రాళ్లు ఈ ఫొటోస్ పై పాజిటివ్ కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు . సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క అంటున్నారు..!!