త్రిష త‌ల్లి పెట్టిన ఆ కండిషన్ వల్లే అమ్మడి లైఫ్ టర్న్ అయిపోయిందట‌.. అంతగా ప్లస్ అయిన ఆ కండిషన్ ఏంటంటే..?!

సౌత్ స్టార్ బ్యూటీ త్రిషకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాలుగు పదుల వయసు దాటుతున్న ఇప్పటికీ యంగ్ లుక్ తో లక్షలాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. రివర్స్ ఏజ్‌ సాధ్యమే అని నిరూపించుకుంటుంది. రోజురోజుకు మరింత యంగ్ లుక్ తో ఆకట్టుకుంటూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ లైఫ్ స్పాన్ చాలా త‌క్కువ‌ అలాంటిది.. త్ర‌షా సౌత్‌లో దశాబ్దానికి పైగా హీరోయిన్గా రాణిస్తుంది. ఇప్పటికి త్రిష వరుస సినిమా అఫ‌ర్స్‌ అందుకుంటూ కెరీర్ పరంగా తన సత్తా చాటుతుంది.

Jodi - #Prashanth - Simran - Trisha Krishnan(Debut) - Movie - JODI | Facebook

అయితే త్రిష హీరోయిన్‌గా సక్సెస్ అందుకోవడానికి కారణం ఆమెకు రెండేళ్ల పాటు త‌ల్లి పెట్టిన ఓ కండీష‌న్‌ అని తెలుస్తుంది. ఇది ఆమె లైఫ్‌నే టర్న్ చేసిందట. మొదటి త్రిష కు క్రిమినల్ సైకాలజీ చదవడం కలగా ఉండేదట. హై స్కూల్లో చదువుకున్న సమయంలోనే ఆమె లాయర్ కావాలని భావించిందట. కాలేజీలో చేరిన తర్వాత త్రిషకు మోడలింగ్ పై ఆసక్తి మళ్ళ‌డంతో అటువైపు అడుగులు వేసింది. మొదట చిన్న చిన్న యాడ్స్ లో ఛాన్సులు దక్కించుకున్న ఏ అమ్మడు.. జోడిలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా కనిపించి మెప్పించింది. దీంతో త్రిష సినిమాల్లోకి వెళ్తానంటూ తన అమ్మకు చెప్పిందట.

Mother's Day special: Trisha to Hansika, celebs share adorable pics with their moms - India Today

త్రిష అమ్మ రెండేళ్లు ప్రయత్నించాలని.. నీకు కంఫర్ట్ అనిపిస్తే నటన కొనసాగించు.. అలా జరగకపోతే బుద్ధిగా వెనక్కి వచ్చేసి చదువుకోవాలని కండిషన్ పెట్టిందట. త్రిష తల్లి పెట్టిన ఆ కండిషన్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వర్షం సినిమా సక్సెస్ సాధించడంతో ఆమె లైఫ్ టర్న్ అయింది. ఈ సినిమాతోనే సక్సెస్ అందుకున్న త్రిషకు వరుస ఆఫర్లు క్యూపట్టాయి. దీంతో వెనక్కి చూసుకునే అవసరం రాలేదు. అనూహ్యంగా ఆమె కెరీర్లు కొన్ని వివాదాలు తలెత్తడంతో కొన్ని సంవత్సరాలు సినిమాలుకు బ్రేక్ ఇచ్చిన.. ఈ అమ్మడు మళ్ళీ రియంట్రి ఇచ్చి సౌత్ సీనియర్ హీరోల సరసన ఛాన్స్‌లు అందుకుంటూ షూటింగ్లలో బిజీగా గడుపుతుంది.