‘ యానిమల్ ‘ దెబ్బతో అమాంతం పెరిగిపోయిన రష్మిక క్రేజ్‌.. ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌ కొత్త రికార్డ్..

‘ యానిమల్ ‘ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకోవ‌డంతో పాటు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొత్త రికార్డ్ సృష్టించింది. ఇన్‌స్టా ఫాలోవర్‌ల లిస్ట్ 40 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో డిజిటల్ రంగంలో విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది.

అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు సినిమాల్లో చేస్తూనే.. మ‌రోవైపు సోషల్ మీడియాలో తన పర్సనల్ అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కు మరింతగా దగ్గరవుతుంది. నిత్యం నెట్టింట సందడి చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మకు యానిమల్ సినిమాతో క్రేజ్ రెట్టింపు అయింది. ఇక‌ ప్రస్తుతం రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, విక్కీ కౌశల్ తో ‘ చావా ‘ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

పుష్ప పార్ట్ 1 సినిమాలో శ్రీవ‌ల్లీ గా ఆకట్టుకున్న రష్మిక ఈ సినిమా ద్వారా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం యానిమల్ మూవీ విజయం సాధించడంతో రష్మికకు బాలీవుడ్ లో వరుస ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయని టాక్.