యువతలో అంతకంతకు పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..?!

ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. పలు సమయాలు చావుకు దారితీస్తున్న సంగ‌ట‌న‌లు చూస్తున్నాం. వాటిలో ముఖ్యమైనది హాట్ స్ట్రోక్‌, క్యాన్సర్ గతంలో వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాదులు ప్రస్తుతం యూత్ లో కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతం లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇక ఆహారాలు అలవాట్లు, వ్యాయామం, సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది యూత్ లో క్యాన్సర్ వేగంగా పెరుగుతుందని తెలుస్తోంది.

Junk Foods to Avoid! - Precision Orthopedics & Sports Medicine : Precision  Orthopedics & Sports Medicine

యువత అంతా తీపి, ఉప్పు, జంక్ ఫుడ్, స్పైసి ఫుడ్ లకు ఎక్కువగా అలవాటు పడడమే దీనికి ప్రధాన కారణం అని అధ్యయనలో వెల్ల‌డైంది. అంతేకాదు తాజా అధ్యయనాల ప్రకారం గతంలో వృద్ధులకు మాత్రమే వచ్చే పెద్ద ప్రేగు, మూత్రపిండం, కడుపు, పిత్రాశయం, ఫ్యాంక్రియాస్‌ లాంటి క్యాన్సర్లు ఇప్పుడు అధికంగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో వారిలో కూడా పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ఈ క్యాన్సర్ ప్రమాదం పురుషల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైధ్యులు చెబుతున్నారు. ప్రో స్టేట్, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు క్యాన్సర్ కారణంగా పురుషుల్లో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

Premium Vector | Exercise fitness logo

ఇక మహిళల విషయానికి వస్తే ఊపిరితిత్తులు, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని.. మహిళల్లో ఈ క్యాన్సర్లు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భాశ‌య, పెద్ద పేగు లాంటి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే వాటికి సులభంగా చికిత్స చేసి నయం చేయవచ్చని.. బ్రెయిన్ క్యాన్సర్ లాంటి జబ్బులను మాత్రం గుర్తించిన ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు. కనక జంక్ ఫుడ్, స్పైసి ఫుడ్ లాంటి ఆహారపు అలవాట్లను మార్చుకొని.. ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం, తగిన వ్యాయామం, నిద్ర యువతకు చాలా అవసరం.