రామ్ చరణ్ ను భయపెడుతున్న యంగ్ హీరో.. ఒక్క దెబ్బ తో సీన్ రివర్స్ అయ్యిందిగా..!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ నటిస్తున్న సినిమా ” బైసన్”. ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది . ఈ సినిమాపై సోషల్ మీడియాలో హ్యూజ్ బజ్ కూడా క్రియేట్ అయింది . తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పిక్ని కూడా రిలీజ్ చేశారు . ఈ పిక్ లో గూస్ బంప్స్ కటౌట్ తో ధ్రూవ్ విక్రమ్ అదిరిపోయే రేంజ్ లో కనిపిస్తున్నాడు . సినిమా పోస్టర్ ఆధారంగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమా కథ మొత్తం కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుందట .

అంతేకాదు ఈ సినిమాలో భారీ భారీ ట్వీస్ట్ లు కూడా ఉంటాయట. అయితే ఇప్పుడు ఇదే న్యూస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను టెన్షన్ పెడుతుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటించబోతున్న సినిమా కూడా ఫుల్ స్పోర్ట్స్ డ్రామగా ఆధారంగా తెరకెక్కుతుంది. ఇది కూడా కబడి గేమ్ నేపథ్యంలోనే తెరకెక్కుతుందట . ఒకానొక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సన మాట్లాడుతూ..” ఈ సినిమాలో చరణ్ చాలా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు… ఫుల్ రా అండ్ రస్టిక్ లుక్ గా ఉంటుంది ..మీరు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుంది .. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అలరింపజేస్తుంది” అంటూ బదులిచ్చాడు .

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అవును కాదు అని చెప్పలేదు కానీ.. పరోక్షకంగా కన్ఫామ్ చేశాడు ..రామ్ చరణ్ సైతం ఒక నేషనల్ సమ్మెట్ లో మాట్లాడుతూ ..”పల్లెటూరి మట్టి కథతో రాబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు”. దీంతో బైసన్ కధ అదేవిధంగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే.. కబడ్డీ నేపథ్యంలోనే రాబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది . ధృవ్ విక్రమ్ కటౌట్ చూస్తుంటే సినిమా పోస్టర్ చూస్తుంటే ఓ రేంజ్ లో ఆకట్టుకునేలా ఉన్నాడు ..బుచ్చిబాబు – రామ్ చరణ్ ఆ స్టామినాని అందుకోగలరా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఒకే ఒక్క పోస్టర్ తో భారీ దెబ్బ కొట్టాడు ధృవ్ విక్రం తో అంటూ రాంచరణ్ ని కొందరు ట్రోల్ చేస్తున్నారు..!!