అలాంటివి చేయాలంటే చిరంజీవి తరువాత ఆ హీరోనే.. ఇండస్ట్రీ రియల్ మగాడు ఆడే..!

సినిమా ఇండస్ట్రీలో రిస్కులు చేసే హీరోలు చాలా తక్కువ . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చేయడం ..ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తో బతికేస్తూ ఉండడం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది హీరోస్ అలా కాదు నాన్న పేర్లు తాతల పేర్లు బ్యాక్ గ్రౌండ్ వాడుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తమ సొంత టాలెంట్ తోనే జీవించాలి అని ..పైకి ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. ఆలిస్టులోకే వస్తాడు అల్లు అర్జున్ . డాడీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అల్లు అర్జున్ గంగోత్రి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఆ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ ఎలా మారిపోయిందో మనం చూసాం .

కేవలం అల్లు అర్జున్ ప్రతి సినిమా హిట్ కొట్టాడా..? అంటే నో అనే చెప్పాలి . హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత కూడా అల్లు అర్జున్ తన కెరీర్ లో ఫ్లాప్స్ చూశాడు . భారీ డిజాస్టర్ లను ఎదుర్కొన్నాడు. ఆ టైంలో ఆయన తెలివితేటలతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేలా చేసింది . కాగా తాజాగా ఒక దర్శకుడు చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ నే అంటూ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

మనసంతా నువ్వే – నేనున్నాను లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు వి ఎన్ ఆదిత్య ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . “చిరంజీవికి పెద్ద అభిమానిని ఆయనతో సినిమా తీయాలని ఉంది మనసులోని కోరికను బయటపెట్టారు”. అంతేకాదు ఇప్పటి హీరోలలో ఎవరితో సినిమా తీస్తారు అంటే ఆదిత్య.. అల్లు అర్జున్ అని సమాధానం ఇస్తాడు. ” చిరంజీవికి అల్లు అర్జున్ యంగ్ పర్సన్ లా కనిపిస్తారు అని.. చిరంజీవి ఘరానా మొగుడు ..యముడికి మొగుడు లాంటి సినిమాల్లో ఓ ట్రీజింగ్ డ్రామా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అలాంటిదే అల్లు అర్జున్తో చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు”.

అయితే ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . అల్లు అర్జున్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో అని.. ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత అలాంటి రిస్క్ పాత్రలు చేసే ఏకైక హీరో మా అల్లు అర్జున్ నే అని.. ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మగాడు అని గట్స్ ఉన్న హీరో అని ప్రశంసిస్తున్నారు..!!