పవన్ సినిమాలో అది ఉంటే సినిమా ఫ్లాప్.. అభిమానులను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!

సినిమా ఇండస్ట్రీలో కొందరు కొన్ని సెంటిమెంట్స్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ బడా హీరోస్ రెగ్యులర్గా కొన్ని సెంటిమెంట్స్ ను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ వారికి వర్కౌట్ అవ్వనప్పుడు అలాంటి కథలు వద్దులే అంటూ అవాయిడ్ చేస్తూ ఉంటారు . ఆ లిస్టులోకి మన పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నాడు . పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గతంలో నటించిన సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కిన మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్మోస్ట్ ఆల్ బోల్తా కొట్టాయి .

అన్నవరం సినిమాతో ఆయన ఏ రేంజ్ లో డిజాస్టర్ టాక్ అందుకున్నాడో మనం చూసాం . అదేవిధంగా బంగారం సినిమా కూడా ఇంచుమించు సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగానే తెరకెక్కుతుంది . ఇది కూడా ఫ్లాప్ అయింది . అయితే అప్పటినుంచి పవన్ కళ్యాణ్ సిస్టర్ బేస్డ్ సెంటిమెంట్ ఆధారంగా ఉన్న మూవీస్ చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వార్త ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా నటిస్తున్న ఓ జి సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ 30% ఉంటుందట . పూర్తి సెంటిమెంట్ కాదు కానీ కథ మొత్తం సిస్టర్ రోల్ పైనే ఆధారపడి ఉంటుందట .

అయితే పవన్ కళ్యాణ్ కి సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ కాదు అని తెలిసినా కూడా డైరెక్టర్ బిగ్ రిస్క్ చేస్తున్నాడు అని అంటున్నారు జనాలు . పవన్ కళ్యాణ్ ఈ విషయం ఆయనకి చెప్పి చూసిన ఆ డైరెక్టర్ పెద్దగా వినలేదట . అంతేకాదు ఫుల్ సెంటిమెంట్ కాదు కదా ఈ పాత్రకు ఇదే హైలెట్ కాబోతుంది అంటూ తన రాసుకున్న లైన్ కి రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్లిపోవడానికి డిసైడ్ అయ్యారట . దీంతో పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. రాజకీయాల పరంగా సక్సెస్ అయిన కూడా సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వాలి అంటే హిట్లు కొట్టాలి.. తప్పదు.. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో ఎక్కువమంది భారీ హీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ ఓజీ.. అలాంటి ఓజీలో సిస్టర్ సెంటిమెంట్ పెడితే సినిమా హిట్ అవుతుందా..? ప్రజెంట్ జనాలు ఇదే విషయాన్ని బాగా ధింక్ చేస్తున్నారు..!!