“పుష్ప2 సినిమా కంటే ముందే”..అభిమానులకు సుకుమార్ భారీ బిగ్ సర్ప్రైజ్..!

టాలీవుడ్ ఇండస్ట్రిలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..ప్రెసెంట్ పుష్ప2 సినిమా కోసం ఎంత బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారో మనకు తెలిసిందే. అసలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పుష్ప 2 సెట్స్ లోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా చాలామంది పెద్దపెద్ద హీరోలు డైరెక్టర్లు .. ఈ ఎండ వేడికి తట్టుకోలేక నాచురల్ గా షూట్ చేసే వాళ్ళు చాలా వరకు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా షూటింగ్స్ ను క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు . అయితే అల్లు అర్జున్ – సుకుమార్ మాత్రం చాలా కఠినంగా ఎండను సైతం లెక్కచేయకుండా పుష్ప2 షూట్ ను కంప్లీట్ చేస్తున్నారు .

ఇలాంటి క్రమంలోనే సుకుమార్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య . మే 7 2004వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కు క్రేజ్ ని తెచ్చి పెట్టింది .

సుకుమార్కు తిరుగులేని రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది. సుకుమార్ కు మంచి బ్రేక్ ఇచ్చింది . ఈ మూవీ రేపటికి విడుదలై 20 ఏళ్లు అవుతుంది . ఈ సందర్భంగా దిల్ రాజు అతని బృందం ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ హైదరాబాదులో భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారట . మరికొద్ది సేపట్లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది. అయితే పుష్ప2 ప్రమోషన్స్ కంటే ముందే మీడియాతో ఈ సందర్భంగా చిట్ చాట్ చేయబోతున్నాడు సుకుమార్ అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇది నిజంగా అభిమానులకి బిగ్ బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి..!!