తారక్ ‘ దేవర ‘ షూటింగ్లో ప్రమాదం..వహాస్పిటల్లో 20 మంది ఆర్టిస్టులు.. అసలేం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్‌లో ది మోస్ట్ ఆసెయిటెడ్‌ మూవీ దేవర తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది. గతంలో కొరటాల శివ తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి వచ్చే దేవరా సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ థ్రిల్ చేసేలా.. సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా తెరకెక్కయి. ప్రస్తుతం దేవర షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఫారెస్ట్ రీజియన్ లో దేవరకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్లో అపశృతి జరగడంతో.. జూనియర్ ఆర్టిస్టులు 20 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. చిన్న సమస్య కారణంగా తేనెటీగ‌లు.. ఆర్టిస్టులపై దాడి చేయడంతో షూటింగ్స్ పార్ట్ లో ఉన్న 20 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన టైంలో అక్కడ తారక్ లేకపోవడంతో ఆయన సేఫ్ గా ఉన్నారని సమాచారం.

Jr NTR arrives in Mumbai in style for War 2

ప్రస్తుతం తారక్‌ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న క్రమంలో విశాఖలో మొదటి ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో తేనెటీగల దాడి జరిగిందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయితే జాన్వి తో పాటు మరో మలయాళ‌ బామ్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోందని తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న దేవ‌ర రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మొదటి భాగం దసరా పండుగ అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.