మన్మధుడు హీరోయిన్ రీఎంట్రీ ఫిక్స్.. భలే మూవీలో ఛాన్స్ కొట్టేసిందే..?!

టాలీవుడ్ ముద్దుగుమ్మ అన్షూ అంబానీకి తెలుగు ఆడియ‌న్స్‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మొదట మన్మధుడు సినిమాతో టాలీవుడ్ ఏంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకులకు దగ్గర అయింది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ అమ్మడు ఒక తమిళ సినిమాలోను నటించింది. ఈమె నటించింది అతి తక్కువ సినిమాలో అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అన్షు.. ఈ నాలుగు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమైంది.

Manmadhudu heroine Anshu ready for Movie Lovers - Telugu News -  IndiaGlitz.com

ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి.. అంతా సడన్గా ఎందుకు సినిమాలు వదిలేయాల్సి వచ్చిందో కారణాలను వివరించింది. ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. తన పూర్వికులు భారతీయులేనని.. తను పదహారేళ్ళ వయసులోనే ఇండియాకు వచ్చేసిందని.. అప్పుడే మన్మధుడు సినిమాలో ఆఫర్ రావడంతో ఆమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాన‌ని.. మళ్ళీ అక్కడికే వెళ్లిపోయాను అంటూ చెప్పింది. కాగా తాజాగా మరోసారి ఆమె రీ ఎంట్రీ కోసమే ఇక్కడికి వచ్చిందని.. ఒక క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Heroine Anshu: అది నచ్చకే సినిమాల్ని వదిలేశా! | Manmadhudu FAme anshu  ambani about movies avm

ప్రస్తుతానికి సందీప్ కిషన్ త్రినాధ రావు నక్కిన డైరెక్షన్లో ఓ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. హాస్య‌ మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అన్షూని అప్రోచ్ అయ్యార‌ని.. కాగా తన క్యారెక్టర్ నచ్చడంతో ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఆమెకు తెలుగులో రియంట్రీ ఇవ్వడానికి సరైన అవకాశం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.