“మమిత బైజు ఇంత ముదురా..?” అప్పుడే ఆ పని స్టార్ట్ చేసేసిందిగా..!

మమిత బైజు.. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ గా మారిన పేరు . పేరుకు మళయాలి బ్యూటీనే అయినా.. తెలుగు జనాలను బాగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మమిత బైజు పేరు చెప్తే కుర్రాళ్ళు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . ఎంతలా అంటే హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు మమిత బైజుకి తెలుగు డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వాలి అంటూ ట్రెండ్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.

మమితా బైజు .. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు తెలుగు హీరోలను పొగిడేసింది. ఆ పొగడ్తలు చూసిన జనాలు అవి ఓ రేంజ్ లో కాదు అని .. క్రీం బిస్కెట్ లా ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మమితా బైజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”నేను తెలుగు సినిమాలు చూస్తాను.. నాకు చాలా చాలా ఇష్టం ..మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ – రామ్ చరణ్ నటించిన సినిమాలు ప్రతిదీ కూడా చూస్తాను. రాంచరణ్ నటించిన మగధీర సినిమా ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.”

“అంతేకాదు అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్.. ఆయనలా టామ్ బాయ్ లా రెడీ అయ్యి నేను స్కూల్ కి వెళ్లే దాన్ని ..ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి ..వాళ్ళిద్దరి సినిమాలు మాత్రం అస్సలు మిస్ చేయను ” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో మమిత బైజు ఆ ఇద్దరు హీరోలతో సినిమా అవకాశం కోసం ట్రై చేస్తుంది అన్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు మమిత బైజు బాగా మహాముదురు అని .. అందుకే ఈ విధంగా పెద్ద హీరోలకు క్రీమ్ బిస్కెట్స్ వేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు..!