మా పార్టీ ప్రచారానికి రావాలంటూ కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు.. సుహాసి షాకింగ్ కామెంట్స్..?!

ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ కొట్టేసిన వారిలో యంగ్ హీరో సుహాస్‌ ఒకడు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. హీరోగా అవకాశాన్ని అందుకున్న సుహాస్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు సుహాస్. ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాలిటిక్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎలక్షన్ ఎఫెక్ట్ మీ వరకు వచ్చిందా అంటూ ఇంటర్వ్యూవ‌ర్‌ నుంచి ప్ర‌శ్న ఎదురైంది. దీంతో సుహాస్‌ స్పందిస్తూ.. ఒకసారి మాత్రమే మా మ్యానేజర్ నాకు ఫోన్ చేసి సర్ ఓ పార్టీ వాళ్లు.. మీరు ప్రచారం చేస్తే రెండు కోట్లు డబ్బు ఇస్తామని ఆఫర్ చేశారుని వివరించాడు.. ఏంటి నేను ప్రచారానికి వెళ్ళాలా.. ఫోన్ చేశారా.. అని అడగడంతో అవును సార్ అని చెప్పారు అంటూ వివరించాడు.

Hombale Films to distribute Suhas' Prasanna Vadanam - The South First

నేను సినిమా ఈవెంట్‌ లోనే సరిగ్గా మాట్లాడలేను, అలాంటిది రాజకీయ ప్రచారాల్లో నేనేం మాట్లాడతా. నా వల్ల కాదు. ఒకవేళ వెళ్లి ప్రచారం చేసిన ఇలాంటి వాడిని తీసుకొచ్చారు ఏంటని వాళ్ళని అందరూ తిడతారు.. అంటూ సుహాసి చెప్పినట్లు వివరించాడు. భవిష్యత్తులో ఏమైనా రాజకీయాల వైపు వెళ్లే అవకాశం ఉందా అని అడ‌గ‌గా.. నాకు రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేదని.. రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి కూడా లేదంటూ వివరించాడు. అయితే ఏ పార్టీ వాళ్ళు రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.