రోజు లిప్ స్టిక్ వేసుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

యూత్ అంతా అందాన్ని పెంచుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అందాన్ని పెంచే సాధనాల్లో లిప్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. షెడ్ లిప్ స్టిక్స్ స్త్రీల అందాన్ని రెట్టింపు చేయడంతో.. వారు కూడా దీనికి ఆకర్షితులవుతూ ఉంటారు. అందుకే మహిళల బ్యాగులలో కనిపించే వస్తువుల్లో లిప్స్టిక్ కచ్చితంగా ఉంటుంది. కొంతమంది తమ దుస్తులకు మ్యాచింగ్ చర్మానికి సరిపడా రంగును బట్టి.. లిప్‌స్టిక్ ను వాడుతూ ఉంటారు. అయితే వర్కింగ్ ఉమెన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఇలా చాలామంది అమ్మాయిలకు ప్రతిరోజు లిప్స్టిక్ వేసుకునే అలవాటు ఉంటుంది. మరి కొంత మంది అమ్మాయిలు వృత్తి మేరకు మేకప్ తో డార్క్ లిప్స్టిక్ ధరించాల్సి ఉంటుంది.

అలాంటి సమయంలో పెదవులు పొడిబారకుండా, నల్లగా మారకుండా హెల్దిగా ఉండాలంటే ఈ చిట్కాలను తప్పక ఫాలో అవ్వండి. ప్రతిరోజు లిప్ స్టిక్‌ వేసుకొనే అలవాటు ఉన్నవారు లోకల్ లిప్‌స్టిక్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్రాండెడ్ వస్తువులను తీసుకోవడం మంచిది. డబ్బు ఆదా చేసే ప్రయత్నంలో తక్కువ ధరలు లిప్‌స్టిక్ తీసుకుంటే దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వాస్తవానికి లోకల్ లిప్‌స్టిక్‌ల్లో చాలా హానికరమైన రసాయనాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. మార్కెట్ నుంచి లిప్‌స్టిక్‌ ను కొనుగోలు చేసే ముందు దానిలో వాడే పదార్థాలపై శ్రద్ధ వహించండి. ఇప్పటికే ఉపయోగించి ఎలర్జీ ఉన్న ఏదైనా ఉత్పత్తిని పొరపాటున కొనుగోలు చేయకండి.

Perfecting Lip Primer – Nude by Nature NZ

ప్రతిరోజు లిప్‌స్టిక్‌ వాడడం వల్ల పెదాలు పొడిబారి పోతాయి, అలాంటి సమయంలో లిప్‌స్టిక్‌ రాసేముందు పెదాలను తేమగా ఉంచడం ముఖ్యం. అలా తేమగా ఉంచుకునేందుకు లిప్ బామ్‌ లేదా లిప్ ఆయిల్ వాడుతూ ఉండాలి. అలాగే ప్రతిరోజు పడుకునే ముందు లిప్‌బామ్‌ రాసుకొని వారానికి ఒక్కసారైనా లిప్స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. మేకప్ ముందు ప్రైమర్ ఎంత ముఖ్యమో లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు ప్రైమర్ వాడటం కూడా అంతే అవసరం. దీనికి కారణంగా లిప్స్‌కు హాని కలిగించకుండా రోజంతా తేమగా ఉంచి.. పెదువులు హెల్తీగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు మీ పెదవులు మరింత అందంగా మారేలా చేస్తుంది.