హాస్పిటల్ బెడ్ పై దిన పరిస్థితుల్లో టాలీవుడ్ బ్యూటీ.. చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..?!

యంగ్ బ్యూటీ దక్షా నాగర్కర్ కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భూగత సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఏకే రావు పీకే రావు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య బంగారు రాజు, హుషారు, రావణాసుర, జాంబిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫొటోస్ షేర్ చేస్తూ షాపింగ్ న్యూస్ వెల్లడించింది. తను గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వివరిస్తూ ఎమోషనల్ అయింది.

Daksha Nagarkar Photos | Daksha Nagarkar Pics & Photo Gallery | Hot, Sexy Daksha  Nagarkar Photos & Photos | Photo Collection of Daksha Nagarkar

అయితే ఆమె అనారోగ్యానికి కారణమేంటో తెలియదు కానీ సర్జరీ అయింది అంటూ ఆమె వివరించింది. చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న పిక్ షేర్ చేస్తూ.. గత కొన్ని రోజులుగా స్ట్రక్చర్ పై.. తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో.. ఉండడం చాలా కష్టంగా అనిపిస్తోందని.. అనస్తీషియాతో నా వెన్న ముఖ పై రెండు సార్లు పొడవడంతో చాలా కష్టంగా అనిపించిందని.. కోలుకోవడం మరింత కష్టమైంది అంటూ వివరించింది. నా ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించా.. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు అండగా నిలిచారు. ఇలాంటి టైంలో మనిషిని ఎలా ప్రేమించాలో వారు చూపించారు.

ప్రేమ కేరింగ్ కి కనిపించని గాయాలు నయం అవుతాయని ఆమె రాసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదంటూ చెప్పిన దక్ష.. మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోండి.. మరీ ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే సరైన వ్యక్తులను కలిగి ఉండడం చాలా అవ‌స‌రం అంటూ వివరించింది. అయితే సంతోషకరమైన భాగాలను మాత్రమే నేను షేర్ చేస్తున్నా.. ఎందుకంటే ఎవరూ బాధపడాలని నాకు ఉండదు అంటూ ఆమె వివరించింది. దీంతో ఈమె ఎమోషనల్ పోస్ట్ చూసిన అభిమానులంతా ఆమెకు ఏమై ఉంటుంది.. అస‌లు స‌ర్జ‌రీ ఎందుకు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.