రూ. 2కోట్ల యాడ్ ఆఫర్ ను ఒక్క క్షణంలో రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం భాష‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఫిదా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అతి తక్కువ కాలంలోనే లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకుంది. నాచురల్ నటనతో పక్కింటి పిల్ల అనిపించేంతగా మెప్పించిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ.. స్కిన్‌షో చేయ‌కుండానే న‌ట‌న‌తో త‌న స‌త్తా చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి చాలా విషయాల్లో భిన్నంగా ఆలోచిస్తూ ఉంటుంది.

తనకు కథ న‌చ్చి, కంటెంట్ ఉందనిపిస్తేనే ఎటువంటి సినిమాల్లో ఆయన నటించే ఈ అమ్మ‌డు.. కోట్ల రెమ్య‌న‌రేష‌న్‌ ఇస్తామ‌న్న స్టార్ హీరోల సినిమాలను కూడా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేసేస్తుంది. అయితే సినిమాలే కాదు తనకు ఇష్టం లేదని రెండు కోట్లు ఇస్తామ‌న్నా.. ఓ యాడ్ కూడా రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. 2019లో ఒక్క బ్లీచింగ్ క్రీమ్ కంపెనీ.. ఫేయిర్‌నెస్ క్రీమ్ యాడ్ కోసం సాయి పల్లవిని అప్రోచ్ అయిందట. అందుకు రమ్యున‌రేషన్ రెండు కోట్లు ఇస్తామని వారు చెప్పారని.. కానీ ఆమె ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అసలు ఈ ఆఫర్ సాయి పల్లవి రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది.

Sai Pallavi comments on MeToo viral

సాయి పల్లవి మాట్లాడుతున్న చిన్నతనంలో ఉన్నప్పుడు నల్లగా ఉండే అబ్బాయిలతో నేను కనిపిస్తే.. నువ్వు చాలా తెల్లగా ఉన్నావు.. అందంగా ఉన్నావు.. అంటూ న‌న్ను పొగిడే వారిని.. అలాగే న‌ల్లగా ఉన్న అమ్మాయిలతో తెల్లగా ఉండే అబ్బాయిని చూస్తే మాత్రం ఆ అమ్మాయి అబ్బాయిని ఏం మాయ చేసి ఉంటుందో అంటూ వెటకారంగా మాట్లాడే వారిని వివరించింది. స్కిన్ కలర్ కు ప్రాధాన్యత ఉండకూడదనే ఉద్దేశంతోనే కోట్ల ఆఫర్ వచ్చిన ఆ యాడ్ ను రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో నిజంగా నీలాంటి హీరోయిన్స్ ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మరెవరు ఉండరు అంటూ.. మీరు నిజంగా గ్రేట్ అంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.