భారీ ధరకు అమ్ముడుపోయిన ‘ హాయ్ నాన్న ‘ ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే లాభాల బాట‌లో నిర్మాత‌లు..?!

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన మూవీ హాయ్ నాన్న. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా ఖ‌న్నా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికి ప్రేక్షకుల్లా మంచి అంచనాల నెలకొన్నాయి. ఇక చివరిగా దసరా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నాని.. ఈ సినిమాతో అదే సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.

Voyaging into the magical world of Hi Nanna. Destining Soon… - YouTube

వైరా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే నాని ఈ సినిమాతో కూడా శౌర్యవ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Nani's 'Hi Nanna' teaser: Lovely and enchanting

ఈ క్రమంలో హాయ్ నాన్న సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ బడ్జెట్ కు అమ్ముడుపోయినట్లు సమాచారం. అన్ని భాషలతో కలిపి హాయ్ నాన్న డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.37 కోట్లకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుందంటూ తెలుస్తుంది. అయితే ఆ ఓటీటీ సంస్థ గురించి వివ‌రాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. అలాగే ఈ మూవీ హిందీ డబ్బింగ్ థియేటర్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.7.5 కోట్లు ముట్టిన‌ట్టు తెలుస్తుంది. ఇలా రిలీజ్ కు ముందే హాయ్ నాన్న మూవీతో నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయట. ఇక సినిమా విడుదలైన తర్వాత ఈ మూవీతో నాని ఇంకెంత‌ లాభం తెచ్చి పెడతాడు చూడాలి.