ప్రియాంకచోప్రా పేరు చెప్పి ఎంత మోసం చేశారో చూడండి ( వీడియో)

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డీఫ్ ఫేక్ వీడియోల వివాదం రోజురోజుకు ఎక్కువవుతుంది. రష్మిక డీఫ్ ఫేక్ వీడియో ఎంత వివాదాస్పదమైందో చూసాం. దీనిపై కేసు కూడా నమోదయింది. ఆ తర్వాత ఆలియా భట్, కాజల్, కత్రినా కైఫ్ ఇలా మరి కొంతమంది డీఫ్ ఫేక్ భారిన పడ్డారు. ఇప్పుడా లిస్టులో బాలీవుడ్ సందరి ప్రియాంక చోప్రా కూడా యాడ్ అయిపోయింది. ప్రియాంక చోప్రా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు వైరల్ అయినా వీడియోలకులా ఇది బోల్డ్ వీడియో కాదు. కానీ ఈసారి ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా మాట్లాడుతున్న వీడియోను డీఫ్ ఫేక్ చేసి ప్రియాంక చోప్రా ముఖాన్ని యాడ్ చేశారు.

Priyanka Chopra Jonas Citadel: How did Priyanka Chopra Jonas became a  global success? 'Citadel' star says she doesn't carry ego or pride - The  Economic Times

ఆ వీడియోలో ప్రియాంక చోప్రా తన యాన్యువ‌ల్ ఇన్‌క‌మ్‌. బ్రాండ్స్ ప్ర‌మోట్ చేస్తు తను ఎంత సంపాదిస్తుంది..ఇలా త‌న సంపాద‌న‌కు సంభందించిన అని విష‌యాలు చెబుతోంది. నిజానికి స్టార్ సెల‌బ్రిటీస్ ఎవ‌రు తమ జీతం, ఆదాయం ఓపెన్గా వివరించారు. ప్రియాంక చోప్రా వీడియో కూడా ఫేక్ అని దీని ద్వారా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే లిప్ సింక్ మ్యాచ్ చేసినా.. గొంతు, ఆమె చెబుతున్న వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు. ఇక ఇటీవల అలియా భట్ మంచంపై కూర్చొని కెమెరా వైపు కొంటె చూపులు చూస్తూ సైగలు చేస్తున్న ఫేక్ వీడియోలు వైరల్ చేశారు.

Priyanka Chopra gets a Hollywood movie! - Hollywood News - IndiaGlitz.com

అంతకుముందు బాలీవుడ్ నటి కాజల్ కెమెరా ముందు బట్టలు మార్చుకుంటున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. రష్మిక వీడియో సంగతి అయితే సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యింది. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన చర్యలు తీసుకుంటూనే ఉంది. సోషల్ మీడియా సంస్థలతో క‌లిసి నిబంధనలను మరింత కఠిన తరం చేసేందుకు ట్రై చేస్తోంది.. అయిన‌.ఆ ఈ గ్యాప్ లోనే మరో డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసే వారిపై జ‌నం మండిప‌డుతున్నారు.