‘ సలార్ ‘ మూవీ రిజల్ట్ పై వేణు స్వామి జోష్యం.. నిరాశలో ఫ్యాన్స్..!!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటారు. ఇక తాజాగా ప్రభాస్ నటిస్తున్న మూవీ పై కూడా వ్యాఖ్యలు చేయడం వ‌ల్ల‌… ప్రభాస్ అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది.

అసలు మేటర్ లోకి వెళితే… ప్రభాస్ నటించిన సలార్ మూవీ ట్రైలర్ గత కొద్ది రోజుల క్రితమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సర్వత్ర నిరాశ ఎదురైంది. ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇక దీంతో అందరి ఆశలు కూడా సలార్ పైనే ఉన్నాయి. ఇక మరోవైపు కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో మరిన్ని ఆశలు నెలకొన్నాయి.

ఇక ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే మాత్రం ఆశలు నిరాశలు అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఇవి ఇలా ఉండగా వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి మాట్లాడుతూ..” ప్రభాస్ ఈ సినిమాతో కూడా విజయాన్ని సాధించలేడు. ప్రభాస్ కి మరో పరజయం తప్పదు ” అంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఈయన కామెంట్స్ చూసిన ప్రభాస్ అభిమానులు… ఆందోళనలో పడ్డారు.