సందీప్ రెడ్డి వంగ మొదట ఆ హీరో సినిమా చేయాల్సిందా.. మిస్ అవ్వడానికి కారణం అదేనా..?!

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పేరు మారు మోగుతుంది. సరికొత్త బ్రాండ్ గా నిలిచి.. ట్రెండ్ సెట్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా సందీప్ రెడ్డి వంగ నిలిచాడు. యానిమల్ సినిమాతో ఒక్కసారి గా అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ఇక ప్రస్తుతం యానిమల్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో మనందరికీ తెలిసిందే. దీంతో నేషనల్ వైడ్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు సందీప్ వంగా.

ఇక ప్రతి ఒక్కరూ ఈయనపై ఆరా తీయడం మొదలుపెట్టారు. మెడికల్ విద్య చదివిన సందీప్ వంగ దర్శకత్వం మీద ఆసక్తితో.. డాక్టర్ వృత్తిని వదిలేసి దర్శకుడిగా మారాడు. ఫిలిం స్కూల్లో డైరెక్షన్ నేర్చుకున్న సందీప్ రెడ్డి ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక ఆ టైంలో ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ కదా తీసుకుని హీరో కోసం తిరుగుతూ ఉండేవాడట.

ఇక అప్పుడే నాని రైడ్ సినిమా రిలీజ్ అయింది. ఆయనకి కథని చెప్పాలని అనుకున్నాడట సందీప్ వంగ. కానీ నానికి కథ ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాడట సందీప్. ఇక అప్పుడే నిర్మాత వేరొక హీరోతో చేద్దామంటే సందీప్ వంగా అస్సలు ఒప్పుకోలేదు. ఇక నాని తో సినిమా చేసే అవకాశం దక్కలేదట సందీప్ వంగాకి. ఇలా ఈయన దర్శకత్వంలో నాని ఓ బ్లాక్ బస్టర్ సినిమానే మిస్ చేసుకున్నాడని చెప్పాలి.