“I am Eagerly Waiting”..అతని పిక్ షేర్ చేస్తూ..ఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన అనుపమ….!

మనకు తెలిసిందే.. ప్రెసెంట్ అనుపమ పరమేశ్వరన్ పలు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లో బిజీబిజీగా ముందుకెళ్తుంది. కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో మంచిగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కొత్త కొత్త న్యూస్ లు అందజేస్తూనే ఉంటుంది . తాజాగా సోషల్ మీడియా వేదికగా అనుపమ పరమేశ్వరణ్ షేర్ చేసుకున్న న్యూస్ ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తుంది .

కెరియర్ స్టార్టింగ్ లో ఓన్లీ ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే చూస్ చేసుకున్న అనుపమ పరమేశ్వరణ్.. ఈ మధ్యకాలంలో తన రూట్ మార్చేసింది . మరీ ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో నటించి రెచ్చిపోయి మరి పెర్ఫార్మన్స్ ఇచ్చింది . దీనితో అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె దానికి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా ఆ రేంజ్ లో రెచ్చిపోవాలా..? అంటూ అనుపమ పై మండిపడ్డారు .

తాజాగా అనుపమ పరమేశ్వరణ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తమిళ్ మూవీ లో ఒక ఆఫర్ వచ్చినట్లు అఫీషియల్ గా ప్రకటించింది . దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేసింది . తమిళ్ స్టార్ డైరెక్టర్ సెల్వరాజ్ దర్శకత్వంలో విక్రంతో హీరోగా నటిస్తున్న సినిమాలో అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దీనిపై అఫీషియల్ గా స్పందించింది .

ఈ మూవీకి “బైసన్ కాలమందన్” అనే టైటిల్ పెట్టారు. ఈ విషయం తెలుపుతూ అనుపమ ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసింది . “చాలా చాలా ధ్రిల్లింగ్ గా ఉంది . సెల్వా సార్ మీకు థాంక్యూ ఈ ప్రాజెక్టులో నన్ను భాగం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ ..ధ్రూవ్ విక్రమ్ కు స్పెషల్ విషెస్ ..అన్ని కష్టాలు అంతంతమాత్రంగానే ఫలిస్తాయి ..అన్ని తుపాకులు జ్వలిస్తూ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి ..షూటింగ్ ప్రారంభం అవుతుంది” అంటూ రాస్కొచ్చింది. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది..!