“మమిత బైజు” పేరు వెనుక ఇంత అర్ధం ఉందా..? అందుకే కుర్రాళ్లు పడి చచ్చిపోతున్నారు..!!

మమిత బైజు ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకే ఒక్క సినిమాతో తన తలరాతను తానే మార్చేసుకుంది. సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది . మలయాళీ బ్యూటీ అయినా సరే తెలుగు జనాలు బాగా బాగా లైక్ చేస్తున్నారు. అందానికి అందం.. నటనకి నటన.. మంచితనానికి మంచితనం . ఇక కుర్రాళ్ళు అమ్మడు ని మిస్ చేసుకుంటారా ..? ఇప్పుడు ప్రతి ఒక్క బాయ్స్ హాస్టల్ లో మమితాబైజు ఫోటోలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి .

కాగా మమితా బైజుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . తాజా ఇంటర్వ్యూలో మమిత బైజు తన పేరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది . నిజానికి ఆమె పేరు మమితా బైజు కాదట . నమిత .. “నేను పుట్టినప్పుడు హాస్పిటల్స్ సిబ్బంది బర్త్ సర్టిఫికెట్ లో నా పేరుని నమితగా నమోదు చేశారు ..నేను స్కూల్లో చేరేటప్పుడు ఈ పొరపాటు వెలుగు చూసింది “..

“ఇది చూసి ఇంట్లో వారు షాక్ అయ్యారు ..పెట్టింది నమిత కానీ డాక్టర్స్ రాసింది మమిత.. సో డాక్టర్స్ పెట్టిన పేరుని కంటిన్యూ అయిపోయిందట”. మరీ ముఖ్యంగా ఆమె పేరే ఆమెకు హైలైట్ గా మారిందట . ఆమె పేరు వల్ల కూడా ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చాయట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. మమిత బైజుకి అదృష్టం ఈ విధంగా మారిపోయింది ఏంటి అంటూ ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు..!!