ఆ స్టార్ హీరోని రిక్వెస్ట్ చేస్తున్న ప్రభాస్..ఏంటి డార్లింగ్ ఈ పరిస్ధితి నీకు..?

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ హీరో ..పాన్ ఇండియా హీరో.. ఒక్కొక్క సినిమాకి 100 నుంచి 150 కోట్లు ఛార్జ్ చేస్తున్న స్టార్ స్టార్ హీరో . అంతే కాదు మంచి మనసున్న హీరో అని కూడా చెప్పాలి . అయితే ప్రెసెంట్ డార్లింగ్ ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు ఎవ్వరిని కూడా ఏ విషయంలో హెల్ప్ అడగరు . అంతవరకు ఆయన తెచ్చుకోడు. ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.

అయితే ఫర్ ద ఫస్ట్ టైం డార్లింగ్ ప్రభాస్ ఒక స్టార్ హీరోని రిక్వెస్ట్ చేస్తున్నారట . అది కూడా ఒక సినిమా కోసం కావడం గమనార్హం. ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు ప్రభాస్ . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట నాగ్ అశ్వీన్.

అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రానా హెల్ప్ తీసుకుంటున్నారట . బాహుబలి సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ ఎంత కారణమో ..?రానా కూడా అంతే కారణం. అయితే రానా ప్రభాస్ చాలా చాలా జాన్ జిగిడి దోస్తులు . కల్కి సినిమా ప్రమోషన్స్ కోసం నాగ్ అశ్వీన్ ..రానా హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారట. అందుకు ప్రభాస్ ని సపోర్ట్ చేయమంటున్నారట . ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్ పై రానా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారట. దీంతో ఈ న్యూస్ నెత్తిన వైరల్ గా మారింది..!!