పవన్ కోసం రేణు దేశాయ్ అంత పెద్ద హిట్ మూవీలో ఛాన్స్ వదులుకుందా.. మ్యాటర్ ఏంటంటే..?!

పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పూణేలో.. గుజరాతి కుటుంబంలో జన్మించిన రేణు దేశాయ్.. సంప్రదాయ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరం నాటిక తమిళ్ సినిమాతో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. పార్తిబన్ జేమ్స్ పాండు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది పూరీ జగన్నా డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ తో పాటు మరో హీరోయిన్గా అమీషా పటేల్ నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ బద్రి సినిమా షూటింగ్ టైంలో ఉండగానే ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. తర్వాత వీరిద్దరూ కొంత కాలం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ సినిమా 2000 లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.

Pawan Kalyan Wife Health News: Pawan Kalyan's ex-wife Renu Desai reveals  suffering from heart, health issues | - Times of India

ఇక ఈ సమయంలోనే వీరిద్దరికీ పెళ్లి కాకుండానే అలాంటి రిలేషన్షిప్ ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. తెలుగులో నటించిన‌ మొదటి సినిమాతోనే సినీ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. పవన్ కళ్యాణ్ ను ప్రేమించి అతనితో లివింగ్ రిలేషన్ షిప్ మొదలు పెట్టిన తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం పవన్‌తో ప్రేమలో ఉన్న కారణంగానే మరే సినిమాలను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట‌. ఈ క్రమంలో 2003లో జానీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర నటించి మెప్పించింది. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే కావడం విశేషం. ఆమె తలుచుకుంటే అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించగలిగేది. కానీ బద్రి సినిమా పూర్తి అయిన తర్వాత ఆమె మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

19 Years for Classic Murari: Check out why the Mahesh Babu starrer was  loved by audience?

ఈ క్రమంలో ఆమెకు మహేష్ బాబు నటించిన మురారి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. రేణు దేశాయ్ కూడా ఆ సినిమా స్క్రిప్ చాలా బాగా నచ్చినా.. పవన్ తో ప్రేమలో ఉన్న కారణంగా అది ఎలాంటి సినిమా అయినా నటించకూడదని రిజెక్ట్ చేసిందట. కేవలం పవన్ తప్ప మరెవరితోనో సినిమా తీయకూడదనే ఉద్దేశంతోనే ఆమె మహేష్ సినిమా రిజెక్ట్ చేసిందట. ఇక తర్వాత ఈ సినిమాలో ఆమె ప్లేస్‌లో సోనాలి బింద్రే నటించింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ కావడంతో ఆమెకు స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటి వ‌చ్చింది. ఒకవేళ ఈ సినిమాల్లో హీరోయిన్ గా రేణు దేశాయ్ నటించి ఉంటే ఈమె స్టార్ హీరోయిన్గా మరో లెవెల్ లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.