మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరో ప్రమాదం..హాస్పిటల్ అడ్మిట్..!!

ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎంత టఫ్ గా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది .మాటలు హద్దులు మీరిపోతున్నాయి . నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . కొన్నిసార్లు పోట్లాడుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ముందుకు వచ్చారు . ఇప్పటికే వరుణ్ తేజ్ – సాయి ధరమ్ తేజ్ ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు .

తాజాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి వచ్చిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. పిఠాపురంలో పాటుపలు చోట్ల ఆయన ప్రచారం చేసి ప్రజలతో ముచ్చటించారు .జనసేన అధికారంలోకి వస్తే జనాలకి ఎంత మేలు జరుగుతుందో అనే విషయాలను క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ క్రమంలోనే కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఆయనపై కొందరు ఆకతాయిలు కూల్ డ్రింజ్ బాటిల్స్ తో దాడి చేశారు . ఈ దాడిలో మెగా హీరోకు తోటిలో ప్రమాదం తప్పింది .

అయితే పక్కనే ఉన్న జనసేన కార్యకర్తకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి . కంటిపై గాయం అయింది . దీంతో హుటాహుటిన హాస్పిటల్ లో అడ్మిట్ చేసినట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు .. జనసేన పార్టీ వాళ్లకి స్పెషల్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేసినట్లు తెలుస్తుంది. కొందరు ఇదంతా వైసిపి నేతలే చేయిస్తున్నారు అని అంటుంటే .. మరి కొందరు పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్ అంటున్నారు .

అయితే గతంలో సాయిధరమ్ తేజ్ ఓ భారీ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ప్రాణాలు పోయినంత పనైంది. ఆ దేవుడి దయవల్ల బ్రతికాడు . ఇప్పుడు సాయి ధరంతేజ్ మరోసారి ఇలాంటి దాడి నుంచి తృటిలో తప్పించుకోవడం మెగా ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొందరు మాత్రం పాలిటిక్స్ ఇలా చీప్ గా మారిపోతాయి .. ఇలా దాడి చేయిస్తారా అంటూ మండిపడుతున్నారు..!!