డాక్టర్ పాపతో రొమాన్స్ కు రెడీ అయిన నాగచైతన్య.. ఆమె ఎవరంటే..?!

అక్కినేని హీరోలలో మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చందు మండేటి డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చైతన్య తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతేడాది చివర్లో దూత వెబ్ సిరీస్‌తో నాగచైతన్య ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Naga Chaitanya's Dhootha to get a sequel | Latest Telugu cinema news |  Movie reviews | OTT Updates, OTT

వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈయనకు దూతా సిరీస్ మంచి ఊరట ఇచ్చింది. నాగచైతన్య గ్రాఫ్ ను రెట్టింపు చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2 కూడా రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ డాక్టర్ పాపా.. యంగ్ ట్యాలెంటెడ్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల లక్కీ సెలెక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్యతో కలిసి రొమాన్స్ చేయనుందట ఈ యంగ్ డాక్ట‌ర్.

Kamakshi Bhaskarla Radiates Glamour in Latest Photos! | Kamakshi Bhaskarla  Radiates Glamour in Latest Photos!

ఇప్పటికే పొలిమేర, పొలిమేర 2, విరూపాక్ష లాంటి సినిమాలు తో భారీ పాపులాటి దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఇక దూత 2 వెబ్ సిరీస్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటూనే.. రొమాంటిక్ సీన్స్ కి కూడా మంచి స్కోప్ ఉండేలా డైరెక్టర్ విక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.